- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మేము బతికేదెట్లా !
దిశ, ఏపీ బ్యూరో: ఈ రేయయితే గడవనీ రేపంటూ చూద్దాం. ఈ పూట నిండనీ బతుకు సాగిద్దాం అంటూ.. పూట తిండి కోసం పని చేస్తూ జీవనం సాగించే వారు పారిశుద్ధ్య కార్మికులు . అలాంటి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలే ఇవ్వకుంటే వారి జీవనం ఎలా సాగుతుంది. నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేక .. ఏం తిని బతకాలి ! జీతాలిచ్చేదాకా పనులు చేసేది లేదంటూ పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించి బైఠాయించారు.
తిరుపతి సర్వజన రుయా ఆస్పత్రిలో మంగళవారం రాత్రి నుంచి పారిశుద్య కార్మికులు నిరసనకు దిగారు. రాత్రి షిఫ్ట్‌లో దాదాపు 170 మంది కార్మికులు చలిలో ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం స్పందించి వేతనాలు ఇచ్చేదాకా ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
అయితే అదే రోజు సీఎం వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించారు. ఆస్పత్రుల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. ఇలా నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా సిబ్బంది ఎలా పనిచేస్తారో ఆయనే సెలవియ్యాలి అంటున్నారు కార్మికులు.