- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈదురు గాలుల బీభత్సం.. రేకులు పడి మహిళ మృతి
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్: ఈదురు గాలులకు ఇంటిపైన ఉన్న రేకులు ఎగిరి మీద పడటంతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ తండాకు చెందిన బట్టు రాజవ్వ (46) గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసేవారు. వీరు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించారు. టోకెన్ నంబర్ రాకపోవడంతో అక్కడే ధాన్యం ఆరబోశారు. బుధవారం ఈదురుగాలులు వీస్తుండటంతో వర్షం పడే అవకాశం ఉందని భావించిన రాజవ్వ, భర్తతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్తుండగా ఓ ఇంటిపైన ఉన్న రేకులు ఎగిరి ఆమెపై పడ్డాయి. తీవ్రంగా గాయపడిన రాజవ్వను హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందారు.
Tags: Karimnagar, A sanitary worker worker, death
Advertisement
Next Story