- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హుజురాబాద్‌లో సాండ్ మాఫియా సూపర్ స్కెచ్
దిశ, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మానేరు నది వారికి కాసుల పంట పండిస్తోంది. నదిపైనే ఆశలు పెట్టుకున్న అన్నదాతలను అక్కున చేర్చుకుంటుందో లేదో కానీ స్మగర్లకు మాత్రం కనకవర్షం కురిపిస్తోంది.
తెల్లవారు జామునే డీల్…
నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సేకరించిన ఇసుక అక్రమంగా ట్రాక్టర్లలో తెల్లవారు జామున హుజురాబాద్ సమీపంలోని ఓ గ్రామ శివార్లకు తరలిస్తారు. అప్పటికే పట్టణంలోని బ్రోకర్లు బుక్ చేసుకున్న పాయింట్ల వివరాలతో అక్కడ సిద్ధంగా ఉంటారు. నేరుగా ఇసుక ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోతోంది. నిత్యకృత్యంగా మారిన ఈ దందాపై కన్నెత్తి చూసే వారు లేరు, నియంత్రించే వారు అంతకాన్నా లేరు. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైంది. ఈ ఒక్క పాయింట్ వద్దకే రోజుకు 50 ట్రాక్టర్లలో ఇసుక చేరుకుంటుందంటే మిగతా ప్రాంతాల్లో ఇసుక అక్రమ దందా ఎంత మేర సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
పీడీ యాక్ట్ పెడతాం..
ఇసుక అక్రమ దందా చేస్తున్న వారిపై పీడీ యాక్టు అమలు చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ట్రాక్టర్ యజమానులతో సమావేశం కూడా ఏర్పాటు చేసిన పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా స్మగ్లింగ్ కు మాత్రం బ్రేకులు పడడం లేదు. ఇసుకను కట్టడి చేసేందుకు మైనింగ్ అధికారులు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కట్టడి లేని ట్రాక్టర్లు…
ఇకపోతే ఇసుక ట్రాక్టర్లను కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గమ్యం చేరుకునేందుకు ట్రాక్టర్లను అడ్డూ అదుపూ లేకుండా వేగంగా నడుపుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా నియంత్రించేవారు లేకుండా పోయారు. ఇటీవల అతివేగంతో వెలుతున్న ఓ ఇసుక ట్రాక్టర్ హుజురాబద్ పోలీస్ స్టేషన్ ముందే మరో వాహనాన్ని డీ కొట్టింది.
సూపర్ స్కెచ్…
ఇక ఇసుక దందాగాళ్లు మరో సూపర్ స్కెచ్ తో ముందుకు సాగుతున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్లు కనిపించకుండా కొందరు జాగ్రత్తలు తీసుకుంటుంతే మరికొందరైతే నకిలీ నెంబర్లతో నడిపిస్తున్నారు. ఇంకోంతమంది అసలు రిజిస్ట్రేషన్ లేకుండానే ట్రాక్టర్లలో ఇసుకను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా డ్రైవర్లుగా మైనర్లను వాడుకుంటున్నారు. ఒకవేళ పోలీసులు పట్టుకున్నా మైనర్లు కాబట్టి అంతగా శిక్షలు ఉండవన్న ధీమాతో పాటు వీరికి డబ్బు ఎర చూపితే ధైర్యంగా దందాలో పాలు పంచుకుంటారని భావించిన మాఫియా ఈ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ నిభందనలకు విరుద్దంగా కండిషన్ లేని వాహనాలను నడుపుతున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే మానేరు నది మీదుగా రోజుకు 500 నుండి 800 ట్రాక్టర్లు ఇసుక దందాలో తిరుగుతున్నాయని ఓ అంచనా. అంటే ఇక్కడ ఇసుక దందా ఎంత మేర సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
శాఖల మధ్య సమన్వయం ఉందా..?
ప్రధానంగా ఇసుక దందాను నిలువరించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి. ముందుగా మైనింగ్ అధికారులు ఈ వ్యవహరంలో చొరవ చూపాల్పిన అవసరం ఉంది. అలాగే గృహ అవసరాల కోసం ఇసుక తరలించేందుకు అనుమతి ఇచ్చే విధానంలోనూ కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. రెవెన్యూ అధికారులు ఇచ్చే పర్మిట్ వివరాలను పోలీసు, మైనింగ్, పంచాయితీలకు ఎప్పటికప్పుడు అందించి ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే నిభందనలకు విరుద్దంగా నడుస్తున్న ట్రాక్టరలను పట్టుకునే వీలు ఉంటుంది. దీనివల్ల ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టే అవకాశం ఉంది.