కత్తి మహేష్ మృతిపై ‘సంపూర్ణేష్ బాబు’ ఎమోషనల్ కామెంట్స్

by Shyam |
katti-mahesh
X

దిశ, వెబ్‌డెస్క్ : సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేష్ మరణవార్త టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కత్తి మహేష్.. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. కత్తి మహేష్ మృతిపై రియాక్ట్ అవుతూ ఎమోషనల్ కామెంట్ చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ”ఎన్నో జ్ఞాపకాలు.. మంచి స్నేహితుడిని కోల్పోయాను” అని సింగిల్ లైన్ ఎమోషనల్ కామెంట్ చేస్తూ కత్తి మహేష్‌తో షూటింగ్ టైంలో దిగిన పిక్ షేర్ చేశారు. ఈ పిక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed