మాతృత్వంలో పోలిక సరికాదు : సమీర

by Shyam |
మాతృత్వంలో పోలిక సరికాదు : సమీర
X

దిశ, వెబ్‌డెస్క్ :
హీరోయిన్ సమీరా రెడ్డికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పెళ్లికి ముందు.. పర్‌ఫెక్ట్ సైజ్, కెరియర్, సినిమాలతో దూసుకుపోయిన తనకు తమిళనాట వీరాభిమానులున్నారు. కానీ పెళ్లయ్యాక.. బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు చాలా లావైపోయింది. తన సైజ్ చూసుకుని తనే బాధపడిపోయి డిప్రెషన్‌లోకి కూడా వెళ్లింది. కానీ మాతృత్వం కన్నా గొప్పవరం మరొకటి ఉండదని తెలుసుకుని.. ఇమ్ పర్‌ఫెక్షన్‌లో పర్‌ఫెక్షన్ చూసింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమీర.. తనలాంటి తప్పు మరొకరు చేయకూడదనే ఆలోచనతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదిక సూచనలు ఇస్తూ ఉంటుంది. తల్లిగా కూడా లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చని తన పోస్ట్‌ల ద్వారా చెప్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పర్‌ఫెక్ట్ మదర్ హుడ్ అంటే ఏంటి? అనే విషయం గురించి వివరించింది సమీర.

సమాజంలో తల్లులు ఒకరినొకరు పోల్చుకుంటారని, కానీ అది సరికాదని చెప్తోంది. పరిపూర్ణమైన లేదా ఉత్తమమైన తల్లిగా కావాలనే లక్ష్యాన్ని విధించుకోవడం.. మీకు, మీ బిడ్డకు అనాలోచిత సమస్యలకు దారి తీస్తుందని తెలిపింది. మీరు మీ బిడ్డ యొక్క ప్రాథమిక శారీరక, మానసిక అవసరాలను తీర్చే తల్లిగా ఉంటే చాలని సూచించింది. మదర్ హుడ్ అంటే పిల్లలకు అన్నీ ఇవ్వగలగాలనే భావన నుంచి బయటకు రావాలన్న సమీర.. తల్లికి కూడా ఫిజికల్, ఎమోషనల్ స్పేస్ అవసరమని తెలిపింది. ఆరోగ్యకరమైన తల్లే ఆరోగ్యకరమైన బిడ్డను తయారు చేయగలదని.. ఇతరులతో పోల్చుకుంటూ పర్‌ఫెక్ట్ మదర్‌గా నిరూపించుకోవాలని ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రపంచంలో పర్‌ఫెక్ట్ మదర్ హుడ్ అనేది ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలంది.

Advertisement

Next Story

Most Viewed