- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎట్టకేలకు విడాకులపై నోరువిప్పిన సమంత.. అక్కినేని ఫ్యామిలీ గుట్టురట్టు..?
దిశ, వెబ్ డెస్క్: అక్కినేని సమంత ఎట్టకేలకు రూమర్స్ పై నోరు విప్పింది. గత కొన్నిరోజులుగా ఆమె, భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకొంటుందని, హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మారుస్తోందని వార్తలు హల్చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పటికే విడాకులు కూడా జరిగినట్లు చెప్తుండగా.. తాజాగా ఆమె ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. సమంత సొంత దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఏర్పాటు చేసి మంగళవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంత చిన్నపాటి వేడుకలు నిర్వహించింది. అలాగే ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తానని ముందస్తుగానే ఓ పోస్ట్ చేసిన సామ్.. చెప్పినట్లుగానే అభిమానులు అడిగిన ప్రశ్నకు ఓపికతో బదులిచ్చింది. ఎక్కువగా అభిమానులందరూ సామ్ – చైతో విడిపోతున్నారన్న వార్తలు నిజమేనా అని అడగడం మొదలు పెట్టారు.
ఇప్పటికే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక విడాకుల నేపథ్యంలోనే ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్టు భోగట్టా ? సమంత చెన్నైలో ఉంటుందని, చైతు హైదరాబాద్లో ఒంటరిగానే ఉంటున్నట్టు బాగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక అభిమాని “‘మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా.?’ అంటూ ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు సామ్ సమాధానం చెప్తూ ” నేను ఎక్కడికి వెళ్లడం లేదు.. హైదరాబాద్ లోనే ఉంటాను.. హైదరాబాద్ నాకు అన్ని ఇచ్చింది.. ఇదే నా ఇల్లు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ పుకార్లు ఎక్కడ, ఎలా మోదలయ్యాయో తనకే తెలియదని, కానీ అవన్నీ కూడా పుకార్లే అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మరి ఈ సెలబ్రేషన్స్ లో అక్కినేని ఫ్యామిలీ లేకపోవడం, చైతూ కూడా తన సక్సెస్ కి శుభాకాంక్షలు చెప్పకపోవడంతో ఇంకా కోడలు పిల్ల ఏదో దాస్తోందని.. ఇంకా అక్కినేని ఫ్యామిలీ గుట్టురట్టు చేయకుండా గోప్యంగా ఉంచుతోందని అభిమానులు గుసగుసడలాడుతున్నారు.