సమంత బోల్డ్ లుక్స్.. రికార్డులు బద్దలు కొడుతున్నాయిగా!

by Shyam |   ( Updated:2023-10-10 15:39:02.0  )
Samantha
X

దిశ, సినిమా: ‘పుష్ప’ సినిమాలో సమంత నటించిన మాస్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ రికార్డులు బద్దలు కొడుతోంది. తెలుగులో విడుదలైన పాట కొన్ని గంటల్లోనే మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకోగా.. తాజాగా 3 కోట్లకు పైగా వ్యూస్‌ సంపాదించి రికార్డ్ క్రియేట్ చేస్తోంది. అంతేకాదు పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించిన ఈ పాటకు ఇప్పటివరకూ అన్ని భాషల్లో కలిపి 4.5 కోట్లకు పైగా వీక్షణలు.. 1.6 కోట్లకు పైగా లైకులు రావడం విశేషం. ఇక ఈ సాంగ్‌ కోసం రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్ తన మాస్‌బీట్స్‌తో మాయచేయగా సమంతా తన బోల్డ్‌నెస్‌తో ఉర్రూతలూగిస్తోంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఈ పాటకు సింగర్ ఇంద్రవతి చౌహాన్ వాయిస్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు.

Advertisement

Next Story