ఆడపిల్లల పెంపకంపై పేరెంట్స్‌కు సమంత సజెషన్స్

by Shyam |
Samantha-Latest-Photo14
X

దిశ, సినిమా: నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇటీవల ఫ్రెండ్‌తో రిషికేష్ ట్రిప్ వెళ్లొచ్చిన సమంత తాజాగా మరో ట్రిప్‌‌కు బయలుదేరింది. ఇందుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్‌‌లో వెయిట్ చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. ఇందులో తన మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్, స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ కనిపిస్తుండగా.. ఎక్కడికి వెళ్తున్నారనే విషయం రివీల్ చేయలేదు. ఇక ఈ ఫొటోతో పాటు మరో మెసేజ్‌ను రీపోస్ట్ చేసింది. ‘మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారనే కంగారు అవసరం లేకుండా ముందు ఆమెను సమర్థురాలిగా తీర్చిదిద్దండి. తన పెళ్లి కోసం డబ్బును పొదుపు చేయకుండా, చదువుపై ఖర్చు పెట్టండి. ముఖ్యంగా ఆమెను పెళ్లికి ప్రిపేర్ చేయకుండా తన కోసం బతికేలా సిద్ధం చేయండి. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసంతోపాటు అవసరమైతే ఎవరినైనా తన వాయిస్‌తో ఎదిరించగలిగే తెగింపును బోధించండి’ అనేది ఆ మెసేజ్‌ సారాంశం.

కాగా చైతన్యతో సెపరేషన్ తర్వాత తన స్టైలిష్ట్ ప్రీతమ్‌తో సామ్ రిలేషన్‌పై అనేక రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్‌ స్టేట్‌మెంట్‌లో ఈ వార్తలను ఖండించిన ప్రీతమ్.. తమది సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ అని, చైతన్యకు కూడా ఈ విషయం తెలుసని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఇలాంటి కామెంట్స్ పట్ల ఒక్కసారి చై స్పందిస్తే ఆగిపోతాయని అనుకుంటున్నట్లు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed