- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హా.. నేను ప్రెగ్నెంట్ : సామ్
బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత, హ్యాండ్సమ్ హీరో నాగ చైతన్యలను పెళ్లయినప్పటి నుంచి చాలా సార్లు, చాలా మంది అడిగిన ప్రశ్న పిల్లల గురించే. ముఖ్యంగా సమంత ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. ఏ చిట్ చాట్‌లో మీట్ అయినా.. ఈ క్వశ్చన్ మాత్రం తప్పక ఉంటుంది. తాజగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్‌లో పాల్గొన్న సామ్‌కు మళ్లీ ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో ఇదే ప్రశ్న విని విని విసుగుచెందిన సామ్.. ఈ సారి కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చింది.
మీరు ప్రెగ్నెంటా అని అభిమాని అడిగిన ప్రశ్నకు.. అవును నేను ప్రెగ్నెంట్.. 2017 నుంచి ప్రెగ్నెంటే! కానీ బేబి మాత్రం బయటకు రావాలని కోరుకోవడం లేదని సమాధానం ఇచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ సమాధానమిచ్చే సామ్ నుంచి ఇలాంటి కోపంతో కూడిన ఆన్సర్ రావడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. అయినా, తను మాత్రం ఎన్నిసార్లు ఓపిగ్గా సమాధానం చెప్తుంది లెండి! అంటున్నారు మరికొందరు.