- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదీ..సామ్ బ్యూటీ సీక్రెట్
పెండ్లి తర్వాత కూడా రాణిస్తున్న హీరోయిన్లలో ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తుంది సమంత. సూపర్ క్యారెక్టర్స్ సూపర్ డూపర్‌గా చేస్తూ లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న సామ్ ఈ మధ్య గార్డెనింగ్, కుకింగ్ అంటూ లాక్ డౌన్ టైమ్‌ను పూర్తిగా వినియోగించుకుంది. అయితే తాను చేసిన సూచనలు కొందరికి బోర్ కొట్టించాయని అర్థం అవుతుందన్న సమంత తన బ్యూటీ సీక్రెట్‌ను షేర్ చేసింది.
తన చర్మం అంత శైనింగ్‌గా ఉండేందుకు కారణం ఏంటో చెప్పేసింది.
విటమిన్ ఇన్ ఫ్యూజన్ థెరపీ చేయించుకోవడం వల్ల స్కిన్ గ్లో వస్తుందని చెప్పింది. నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి ఈ థెరపీ చేయించుకుంటాను అని వెల్లడించింది. అంబ్రోసియా క్లినిక్ ద్వారా విటమిన్ ఇన్ ఫ్యూజన్ ట్రీట్మెంట్ తీసుకుంటాను అని.. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే.. తన ( సమంత) పేరు యూజ్ చేస్తే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుందని చెప్పింది.
https://www.instagram.com/p/CCdUJYEBu2c/?igshid=jyzdlsxy8svf
చివరగా 96 రీమేక్ జాను సినిమాలో కనిపించిన సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతుంది. మరోవైపు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయన తార, విజయ్ సేతుపతితో కలిసి నటించబోతుంది.