- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఫ్యామిలీ కష్టాలన్నీ నావే : Samantha
దిశ, సినిమా: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఫ్యామిలీ మ్యాన్2’ (The Family Man 2) వెబ్ సిరీస్‌లో సమంత (Samantha) పర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సామ్‌కు హిందీలో ఇదే డెబ్యూ సిరీస్ కాగా, నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో తను చేసిన యాక్షన్ స్టంట్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. అయితే ఆ స్టంట్లను తనే సొంతంగా చేశానని తెలుపుతూ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సెట్స్ నుంచి బీటీఎస్ వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది సామ్.. ఈ సందర్భంగా తన యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఎత్తైన బిల్డింగ్స్‌పై నుంచి దూకేందుకు భయపడ్డానని.. తన వెనుక స్టంట్ మాస్టర్ ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగానని పోస్ట్ చేసింది. బాడీ పార్ట్స్ అన్నీ నొప్పులతో సహకరించకున్నా సొంతంగా స్టంట్స్ చేసేలా ట్రైన్ చేసినందుకు స్పెషల్ థాంక్స్ చెప్పింది.
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, సమంత లీడ్ రోల్స్ ప్లే చేసిన సిరీస్‌ను రాజ్ అండ్ డీకే రూపొందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సామ్.. గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’తో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాలో నటిస్తోంది.