నా డ్రీమ్ రోల్ అదే : సమంత

by Jakkula Samataha |
నా డ్రీమ్ రోల్ అదే : సమంత
X

దిశ, సినిమా : టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని చాలా సెలెక్టివ్‌ రోల్స్ ఎంచుకుంటూ, సక్సెస్ సాధిస్తోంది. సామ్ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘శాకుంతలం’లో టైటిల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆదిపర్వంలో అత్యద్భుతమైన శాకుంతల- దుశ్యంతల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో ఇన్నాళ్లకు దిల్‌రాజు, గుణశేఖర్‌ ఓ పెద్ద బహుమతినిచ్చారు. పదేళ్లలో 50 సినిమాల్లో నటించాను. కానీ చిన్నప్పటి నుంచి రాకుమార్తెగా నటించాలన్నదే నా డ్రీమ్. ఆ రోల్‌ చేయలేదనే లోటు ఎప్పటి నుంచో నాలో ఉండిపోయింది. ఇప్పుడు గుణశేఖర్‌ వల్ల ‘శాకుంతలం’తో అది నెరవేరుతోంది. ఇలాంటి అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు ఆనందిస్తున్నాను’ అని తెలిపింది. దిల్ రాజు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, గుణశేఖర్‌ కుమార్తె నీలిమ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కానున్నారు. అలాగే, ఇందులో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌మోహన్‌ సందడి చేయనున్నారు.

Advertisement

Next Story