- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు కత్తితో గడ్డం గీసుకోవాలనుందా..? అయితే అక్కడికి వెళ్లాల్సిందే..
దిశ, వెబ్ డెస్క్ : మగవాళ్లకు గడ్డం గీసుకోవడమంటే అదొక బలవంతపు బద్దకపు పని. కానీ వృత్తిపరమైన ఉద్యోగాలు చేసేవారికి ఆ కష్టాలు తప్పవు. ఉదయం లేవగానే అద్దం ముందు షేవింగ్ క్రీమ్, రేజర్ పట్టుకుని తంటాలు పడాల్సిందే. మరి ఎప్పుడూ అదే రేజర్, సబ్బు నీళ్లతో గడ్డం గీసుకుని బోర్ కొట్టిందా..? బంగారు కత్తితో గడ్డం గీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకో బంపర్ ఆఫర్. ఈ ఆఫర్ పొందాలంటే మీరు మహారాష్ట్రలోని పూణెకు వెళ్లాల్సిందే.
పూణెకు చెందిన ఒక బార్బర్ ఈ బంగారు రేజర్‌ను తయారుచేయించాడు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో రోడ్డున పడ్డ వారిలో క్షౌర వృత్తిదారులు కూడా ఉన్నారు. కొవిడ్ వ్యాప్తి భయంతో చాలా మంది సొంతంగా ట్రిమ్మర్‌తోనో లేక రేజర్ కొనుక్కోని వచ్చి గడ్డం గీసుకోవడమో చేశారు. కొన్నాళ్లుగా ఈ పరిస్థితి మారినా మహారాష్ట్రలో మాత్రం కరోనా మళ్లీ తిరగబెడుతున్నది. అక్కడ రోజురోజుకూ మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్నది. ఈ కారణంతో బార్బర్ షాపులకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. దీంతో పూణెకు చెందిన అవినాష్‌కు ఒక ఐడియా తట్టింది.
ఇది కూడా చదవండి : ఉతికి ‘ఆరే’సిన పొలార్డ్.. యువరాజ్ తర్వాత అతడే..
ఏదైనా ప్రత్యేకత ఉంటే తప్ప జనాలు తన షాపులోకి రారని అర్థమైన అవినాష్.. గడ్డం గీసే రేజర్‌ను బంగారంతో తయారుచేయించాడు. రూ. 4 లక్షల విలువ గల 80 గ్రాముల బంగారంతో దీనిని చేయించాడు. అంతటితో ఊరుకున్నాడా..? పబ్లిసిటీ కోసం తన షాపును స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గోపిచంద్ పడ్వల్కర్‌తో ఓపెన్ చేయించాడు. ఎమ్మెల్యే గారి ఓపెనింగ్ అంటే మీడియా కవరేజీ కూడా కలిసొస్తుందనే ఉద్దేశంతో ఈ ప్లాన్ వేశాడు అవినాష్.
అనుకున్నట్టుగానే అవినాష్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. బంగారు కత్తితో గడ్డం గీసుకోవడానికి అతడి షాప్ ముందు కస్టమర్లు క్యూ కడుతున్నారు. అయితే కత్తిని బంగారంతో చేయించారని దాని రేటు కూడా అదే లెవల్‌లో ఉంటుందని అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు. సాధారణ షేవింగ్‌లకు ఎంతైతే తీసుకుంటున్నాడో.. అంతే కాస్ట్ తో చేస్తున్నాడు. సాధారణ ప్రజలు ఆ ఫీల్ ను మిస్ అవ్వకుండా ఉండటానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అంటున్నాడు. షేవింగ్ తీసినందుకు ఒక వ్యక్తి దగ్గర అవినాష్ వసూలు చేసే మొత్తం వంద రూపాయలు మాత్రమే.