షారుఖ్ ‘పఠాన్‌’లో సల్మాన్.. బిగ్ బాస్‌లో క్యారెక్టర్ రివీల్!

by Jakkula Samataha |
షారుఖ్ ‘పఠాన్‌’లో సల్మాన్.. బిగ్ బాస్‌లో క్యారెక్టర్ రివీల్!
X

దిశ, సినిమా : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రసారమవుతున్న సీజన్ 14, మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి షోలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చారు సల్లూ భాయ్. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కూడా నటిస్తున్న ఈ సినిమాలో షారుఖ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తనకు బ్రాండ్‌ క్యారెక్టర్ అయిన ‘టైగర్’ గానే సల్మాన్ ‘పఠాన్‌’లో కనిపిస్తారని తెలుస్తుండగా.. ఈ మూవీ చిత్రీకరణ కోసం 12 రోజుల పాటు దుబాయ్‌కు వెళ్లనున్నారు. బిగ్ బాస్ షో ముగియగానే ‘పఠాన్’ షూటింగ్‌లో పాల్గొంటానని.. ఆ తర్వాత ‘టైగర్ 3’ మూవీ గురించి ప్రిపేర్ అవుతానని తెలిపారు సల్లూ భాయ్.

Advertisement

Next Story