- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా ప్రయాణికుల కోసం సజ్జనార్ మరో కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజా రవాణా ఆర్టీసీలో ఎండీ సజ్జనార్ పలు కీలక మార్పులు తీసుకొస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో బస్సు ప్రయాణంలో మహిళా ప్రయాణికులకు వెంటాడుతోన్న మూత్రవిసర్జన సమస్యకు చెక్ పెట్టేలా సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు.. అత్యవసరాలకు వెళ్లేందుకు బస్సు ఆపమని డ్రైవర్‌ను అడగలేక, ఒకవేళ ఆపినా సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఓ మహిళ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై వెంటనే స్పందించిన సజ్జానార్.. రాత్రివేళల్లో ప్రయాణించేవారు తమ అత్యవసరాల కోసం బస్సును ఆపవచ్చని ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా, టోల్‌ప్లాజాల వద్ద ఉన్న కన్వీనియన్స్ రూమ్స్‌లను వినియోగించుకోవాలని తెలిపారు. దీనికోసం ప్రతి బస్సులో అనౌన్స్ చేయాలి అని టీఎస్‌ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో రోడ్డుకిరువైపులా ఉండే దాబాలు, హోటళ్ల వద్ద టాయిలెట్స్ వినియోగించుకునేందుకు కొంత సేపు బస్సు ఆపాలని ఆదేశించారు.
- Tags
- drivers