- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయి: సజ్జల
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటూ ప్రమాదరకర రాజకీయాలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రతలేని దేవాలయాలను టార్గెట్ చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. మతపరమైన అంశాలపై మేము ఎప్పుడైనా ఉద్యమాలు చేశామా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు మతం ఆధారంగా రాజకీయం చేస్తున్నారని, దివాళా తీసిన టీడీపీకి మత రాజకీయాలతో ఏం లాభం అన్నారు. పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్‌తో ఎంతమంది చనిపోయారని గుర్తుచేశారు.
మతం పూర్తిగా వ్యక్తిగతమైందని, ఎవరి విశ్వాసాలు వారివన్న సజ్జల.. కుల, మతాలకు అతీతంగా పనిచేస్తున్నామని తెలిపారు. రామతీర్థం ఘటన పథకం ప్రకారమే జరిగిందని, ఉన్మాద స్థాయిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడారని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలను సీఎం జగన్ సహించరని పేర్కొన్నారు.