- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్ ఆశలు సమాప్తం..
దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ టోక్యో ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటికే పలు అర్హత టోర్నీలు రద్దు కాగా.. తాజాగా సింగపూర్ ఓపెన్ కూడా రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించడంతో వారికి ఒలింపిక్స్ దారులు మూసుకొని పోయాయి. ఇకపై బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఎలాంటి అర్హత పోటీలను నిర్వహించడం లేదని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న ర్యాంకింగ్స్‌లో ఇకపై మార్పులు జరగవని.. వీటి ఆధారంగానే ఒలింపిక్స్ అర్హుల జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఆటగాళ్ల అర్హత కటాఫ్ తేదీని బీడబ్ల్యూఎఫ్ ఈ ఏడాది జూన్ 15కి మార్చింది. ఆ రోజుకు ఉన్న ర్యాంకుల ప్రకారం టాప్ 16 ఉన్న వారికి నేరుగా ఒలింపిక్స్‌కు ఎంట్రీ లభించనున్నది. కటాఫ్ తేదీకి ఇంకా 17 రోజుల సమయం ఉన్నా.. ఎలాంటి అర్హత పోటీలు లేనందునా సైనా, శ్రీకాంత్ ఆశలకు గండిపడింది. ఇప్పుడు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొననున్నది.