- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాయ్ కోచ్ దుర్మార్గం.. మైనర్ బాలికపై అత్యాచారం
దిశ, స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పని చేస్తూ కోచ్‌గా మారిన ఒక వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సాయ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కోచ్ (50) గా పని చేస్తున్న వ్యక్తి 13 ఏళ్ల మైనర్ బాలికకు ప్రైవేటుగా కోచింగ్ ఇస్తున్నాడు. సదరు బాధితురాలు సాయ్ ప్రాంగణానికి వెలుపలే కోచింగ్ తీసుకుంటున్నది. ఈ క్రమంలో ఆ బాలికపై కోచ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు నమోదయ్యింది. దీంతో అతడిపై పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తీహార్ జైలుకు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే సదరు కోచ్‌ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించాము’ అని సాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. సాయ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే సదరు బాలికకు కోచ్ శిక్షణ ఇస్తున్నాడని సాయ్ స్పష్టం చేసింది.