Sai Pallavi : షాకింగ్ కామెంట్స్.. అర్ధరాత్రి వారు నా చెయ్యి పట్టుకొని

by Anukaran |   ( Updated:2021-09-23 07:59:33.0  )
Sai Pallavi :  షాకింగ్ కామెంట్స్.. అర్ధరాత్రి వారు నా చెయ్యి పట్టుకొని
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఫిదా’ చిత్రంతో తెలుగు కుర్రాళ్ల మనసుల్లో సింగిల్ పీస్ భానుమతిగా కొలువుండిపోయింది సాయి పల్లవి. ఆమె డాన్స్ కి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు. సెలక్టివ్ గా కథలను ఎంచుకొంటూ ఆనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తోంది. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈ నెల 24 న ఈ సినిమా థియేటర్ లలో విడుదల కానుంది. ఇక ఈ ప్రమోషన్లో పాల్గొన్న అమ్మడు ‘ఫిదా’ నాటి రోజులను గుర్తుచేసుకోంది. అంతేకాకుండా తన లైఫ్ స్టైల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగినా తనకు సాధారణ జీవితమే ఇష్టమని చెప్పుకొచ్చింది.

‘ఫిదా’ షూటింగ్ జరిగేటప్పుడు బాన్సువాడ ప్రజలు తనను ఎంతో ప్రేమగా చూసుకొన్నారని చెప్పిన సాయి పల్లవి తనను వారి సొంత కూతురిలా చూసుకున్నారని, ఆ ఫీల్ మంచిగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ కోసం ఆర్మూర్ గ్రామం వెళ్ళినప్పుడు కూడా అదే స్వాగతం లభించడం సంతోషంగా ఉందని తెలిపింది. కరోనా సమయంలో రాత్రిపూట షూటింగ్ జరిగినా కూడా విసుగు చెందలేదని.. అంతేకాకుండా వాళ్లంతా దగ్గర కూర్చొని చెయ్యి పట్టుకొని మాట్లాడారని, తనతో చాలా విషయాలు పంచుకున్నారని తెలిపింది. అక్కడ గ్రామస్థులు షూటింగ్ అయిపోయి వెళ్తుంటే తనకు చీరను బహమతిగా ఇచ్చినట్లు తెలిపిన సాయి పల్లవి తనకు సాధారణ జీవితం గడపడమంటేనే ఎంతో ఇష్టమని చెప్పింది. స్టార్ గా ఒక సినిమా హిట్ అయితేనే రెమ్యూనిరేషన్ పెంచేసి, చుట్టూ నలుగురు అసిస్టెంట్లతో కనిపించే హీరోయిన్లు ఉన్న ఈ ఇండస్ట్రీలో ఇలా సింపుల్ గా ఉండడం చాలా గ్రేట్ అని సాయి పల్లవి అభిమానులు పోగిడేస్తున్నారు. ఎంతైనా ఇండస్ట్రీకి సాయి పల్లవి సింగిల్ పీస్ అని చెప్పుకోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed