అందుకే.. పెళ్లి చేసుకోను: సాయి పల్లవి

by Jakkula Samataha |
అందుకే.. పెళ్లి చేసుకోను: సాయి పల్లవి
X

సాయి పల్లవి.. ‘గ్లామర్ షో’ కాకుండా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలకే సైన్ చేస్తుంది. కంటెంట్‌లో మ్యాటర్ ఉంటే తప్ప కాల్షీట్ ఇవ్వదనేది తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలు చేస్తున్న సాయి పల్లవి.. పెళ్లి చేసుకోనని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఈ మధ్యే అభిమానులతోనూ పంచుకున్న అమ్మడు.. షాక్ ఇచ్చినంత పని చేసింది. అయితే ఇందుకు కారణం ఏంటని.. ఫ్యాన్స్ మెదడుకు పనిచెప్తుంటే, తనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

‘నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సుఖంగా, సంతోషంగా చూసుకునేందుకే తను పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు’ తెలిపింది. జన్మనిచ్చిన వారికి ఏ కష్టం లేకుండా చూసుకోవడానికి మించిన అదృష్టం ఏముంటుంది? అంటోంది. సాయి పల్లవి నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు ఇదేం పిచ్చి డెసిషన్ అంటున్నారు. లేదంటే ప్రేమలో ఫెయిలై.. ఇలాంటి నిర్ణయం తీసుకుందేమోనని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed