సచిన్ టెండూల్కర్ మళ్లీ వస్తున్నాడు..? మ్యాటర్ లీక్ చేసిన గంగూలీ..!

by Anukaran |   ( Updated:2021-12-17 06:26:48.0  )
సచిన్ టెండూల్కర్ మళ్లీ వస్తున్నాడు..? మ్యాటర్ లీక్ చేసిన గంగూలీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: Sachin comes out to bat.. ఈ మాట వింటే చాలు క్రికెట్ మైదానం మారు మ్రోగిపోయేది. క్రీజులో మాస్టర్ బ్లాస్టర్ ఉన్నంత సేపు భారత్‌కు కొండంత భరోసా.. ఇక ప్రత్యర్థి బౌలర్లకు మాత్రం వణుకే. క్రికెట్ రంగంలోనే భయాంకర బ్యాట్స్‌మాన్‌గా పేరు తెచ్చుకున్న సచిన్‌ 2013లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇక తన చివరి టెస్టు‌ మ్యాచ్‌లో సచిన్ మైదానం వీడిన క్షణాలు అభిమానులను ఎంతో భావోద్వేగానికి గురి చేశాయి.

ఆనాటి నుంచి కేవలం (ఐపీఎల్‌) ముంబై ఇండియన్స్‌ జట్టులో కొనసాగిన టెండూల్కర్‌ అంతగా ఫోకస్ పెట్టలేదు. మెంటార్‌గా ఉన్నప్పటికీ సచిన్ మార్క్ ఎక్కడా చూపించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, త్వరలో టీమిండియాలో మాస్టర్ బ్లాస్టర్ కీలక రోల్ ప్లే చేస్తాడని వస్తున్న వార్తలు అభిమానులను సంబురంలోకి నెట్టేశాయి.

తోటి ఆటగాళ్లతో మళ్లీ మైదానంలోకి..

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, హెడ్‌కోచ్‌‌గా రాహుల్ ద్రవిడ్, ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌లు కొనసాగుతున్నారు. ఎట్టకేలకు ధోని కూడా ఇటీవల టీ20 వరల్డ్ కప్‌కు మెంటార్‌గా సేవలు అందించాడు. ఇదంతా గంగూలీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నుంచే జరిగాయి. ఇక వీరి దశలోనే మాస్టర్ బ్లాస్టర్‌ కూడా టీమిండియా తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మాజీ ఆటగాళ్ల మాదిరిగానే సచిన్ టెండూల్కర్‌ కూడా టీమిండియాకు బ్యాకప్‌ స్టాఫ్‌లో చేరుతాడని గంగూలీ ఓ హింట్‌ ఇచ్చాడు.

బీసీసీఐ బాస్ బ్యాక్​స్టేజ్ విత్ బోరియా అనే ఇంటర్వ్యూలో పాల్గొన్న గంగూలీ.. ఏదో ఒక రోజు సచిన్ లాంటి లెజెండరీ క్రికెటర్ల సహాయం టీమిండియాకు అవసరమని చెప్పుకొచ్చాడు. ఆ సమయం కూడా త్వరలోనే వస్తోంది అంటూ ఆశాభావం వ్యక్తం చేయడంతో మళ్లీ మాస్టర్ బ్లాస్టర్ మైదానంలోకి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

కానీ, తన రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్‌ ఏ రోజు కూడా బ్యాకప్‌ స్టాఫర్‌ అవుతానని చెప్పలేదు. ఇదిలా ఉంటే హెడ్‌ కోచ్‌గా వచ్చేందుకు తొలుత రాహుల్ ద్రవిడ్‌ మొండికేసినా.. దాదా ఒప్పించాడు. ఈ క్రమంలోనే టెండూల్కర్‌తో చర్చలు జరిపి మళ్లీ మైదానంలోకి తీసుకొస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఇక వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed