సయామీ నటనకు సచిన్ ప్రశంస

by Shyam |
సయామీ నటనకు సచిన్ ప్రశంస
X

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన చిత్రం ‘చోక్డ్’. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైందన ఈ సినిమాలో మధ్యతరగతి యువతిగా బాలీవుడ్ నటి సయామీ ఖేర్ నటించారు. కాగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఆమె నటన అద్భుతంగా ఉందంటూ.. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. ‘ఓ స్నేహితురాలు నటించడమే కాదు.. బ్యాటింగ్ కూడా చేస్తుంది. లవ్ యువర్ పర్ఫార్మెన్స్ సయామీ # చోక్డ్’ అని సచిన్ కామెంట్ చేయడంతో పాటు ఆమె బ్యాటింగ్ చేస్తున్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు సచిన్. దానికి సయామీ ఖేర్ ‘థ్యాంక్యూ యూ సో మచ్, ఈ ప్రశంస నాకు.. ఖేల్ రత్న, ఆస్కార్ రెండు కలిసి ఒకేసారి అందుకున్న ఫీలింగ్ కలుగుతుంది’ అని బదులిచ్చింది.

ఇక చోక్డ్ సినిమా విషయానికొస్తే.. 2016లో కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన ‘నోట్ల రద్దు’ నేపథ్యంలో కథ సాగుతుంది. ఒక సగటు మధ్య తరగతి గృహిణికి ఒక్కసారిగా లక్షల కొద్దీ డబ్బు వచ్చి పడితే.. ఆ టైమ్‌లోనే ‘నోట్ల రద్దు’ జరిగితే… ఆమె పరిస్థితి ఏంటి, ఆ డబ్బును ఆమె సొంతం చేసుకుంటుందా? లేదా? అన్నదే ఈ చిత్ర కథాంశం. అయితే ఈ చిత్రకథను అనురాగ్ కశ్యప్ గర్ల్‌ఫ్రెండ్ శుభ్ర శెట్టి 2015లో అందించారు. ‘నా సినిమాలు చూడటం వల్ల డిస్టర్బ్ అవుతాననే కారణంతో ఆమె చూడదు. కానీ నేను అందిస్తున్న ఈ కథను నువ్వు సినిమాగా తీస్తే తప్పకుండా చూస్తానంది. అన్నట్టుగానే ఆమె ‘చోక్డ్’ చూసి చాలా సంతోషించింది’ అని అనురాగ్ ఇటీవలే ఓ ఇంటర్య్వూలో చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed