- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సచిన్ టెండుల్కర్ సంచలన వ్యాఖ్యలు
ముంబయి: ఈతరం క్రికెట్‌లో బంతికి, బ్యాట్‌కు మధ్య బ్యాలెన్సింగ్ దెబ్బతింటోందని, ప్రస్తుత నిబంధనలు బౌలర్ కన్నా బ్యాట్స్‌మన్‌కే ఎక్కువ లాభంచేకూర్చే విధంగా ఉంటున్నాయని అనేకమంది మాజీ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. టీ20 ఫార్మాట్ వచ్చినప్పట్నుంచి నిబంధనలన్నీ బ్యాట్స్‌మెన్‌కే అనుకూలంగా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోబాల్ తర్వాత ఫ్రీ హిట్, బరువైన, వెడల్పైన బ్యాట్‌ల వాడకానికి అనుమతివ్వడం వంటి అనేక నిబంధనలే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఈ క్రమంలోనే బౌలర్లకు జరిగే అన్యాయం గురించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం స్పందించారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రీడారంగం.. ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచడం, జట్టులో కలిసేముందు 14 రోజులపాటు క్వారంటైన్‌లో గడపడం వంటి అనేక కఠిన నిబంధనలతో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే క్రికెట్‌లో బంతికి ఉమ్మి రాయడాన్ని ఐసీసీ నిషేధించింది. అయితే, బంతి రివర్స్ స్వింగ్ అవ్వడానికి బౌలర్లు కొన్ని దశాబ్దాలుగా ఉమ్మి, చెమటను రుద్దుతున్నారు. తాజా, నిబంధనల ప్రకారం అందుకు అవకాశం లేకపోవడంతో బౌలర్లు మంచి బంతులు వేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ, బంతికి ఉమ్మి రాయకూడదనే నిబంధన బౌలర్లను వికలాంగులుగా మార్చిందని వ్యాఖ్యానించాడు. చెమటను రాసే వీలున్నప్పటికీ అది ఉమ్మి అంత ప్రభావం చూపలేదని బౌలర్లు తనతో చెప్పినట్టు వెల్లడించారు. కావున, ఉమ్మికి ప్రత్యామ్నాయం తీసుకురావాలని అభిప్రాయపడ్డాడు.