గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన సమంత అక్కినేని

by Jakkula Samataha |
గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన సమంత అక్కినేని
X

దిశ, సినిమా: గతేడాది సెప్టెంబర్‌లో టాలీవుడ్ స్టార్ సమంత అక్కినేని వ్యాపార భాగస్వామిగా ‘సాకి’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఏడాదిలోనే పాపులర్ బ్రాండ్‌గా అవతరించిన ‘సాకి’ ఇప్పుడు మరో మైల్‌స్టోన్‌ను అందుకునేందుకు సిద్ధమైంది. దీని పేరెంటల్ కంపెనీ అయిన ‘మెర్క్ లైఫ్‌స్టైల్’ ఈ సెలబ్రిటీ బ్రాండ్‌ను గ్లోబల్ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. మార్చి 19న యూఎస్ఏ, మలేషియా, సింగపూర్‌కు ఎక్స్‌పోర్ట్ స్టార్ట్ చేసిన కంపెనీ.. ఆ తర్వాత కెనడా, యూఏఈ, ఆస్ట్రేలియా తదితర ఇంటర్నేషనల్ మార్కెట్స్‌కు విస్తరించింది.

కాగా, తమ బ్రాండ్ గ్లోబల్ మార్కెట్‌కు విస్తరించడం పట్ల సమంత తన ఆనందాన్ని పంచుకుంది. ‘మేము సాకి బ్రాండ్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి ఇండియన్ ఆడియన్స్‌ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. కొన్ని నెలలుగా విదేశాల్లోని ఫ్యాన్స్ నుంచి తమ బ్రాండ్ కోసం అనేక రిక్వెస్ట్‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 6 దేశాలకు షిప్పింగ్ మొదలుపెట్టడం ఎగ్జైటింగ్‌గా ఉంది. త్వరలోనే మరిన్ని దేశాలకూ ఈ సేవలు విస్తరిస్తాం. మా గ్లోబల్ కస్టమర్‌లు మొదటిసారి ‘సాకి’ ఉత్పత్తులను ఎక్స్‌పీరియన్స్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ ఫీలింగ్‌ను చిరస్మరణీయంగా మార్చాలని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story