బైడెన్‌కు రష్యా ప్రెసిడెంట్‌కు పుతిన్ శుభాకాంక్షలు

by vinod kumar |
బైడెన్‌కు రష్యా ప్రెసిడెంట్‌కు పుతిన్ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ గెలుపును సోమ‌వారం ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సందర్భంగా ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. న‌వంబ‌ర్‌ 3న జరిగిన అమెరికా అధక్ష ఎన్నికల్లో బైడెన్‌కు 306 ఎల‌క్టోర‌ల్ ఓట్లు పోల‌వ్వ‌గా.. ట్రంప్‌కు 232 ఓట్లు పోల‌య్యాయి. దీంతో బైడెన్ విక్ట‌రీని ఇవాళ ఎల‌క్టోర‌ల్ కాలేజీ ద్రువీక‌రించింది. అంతేగాకుండా ఈ సందర్భంగా బైడెన్ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సలహాదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Next Story

Most Viewed