- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట!
ఆది పినిశెట్టి ఒక పాత్ర కమిట్ అయితే.. వంద శాతం న్యాయం చేస్తాడు. కంటెంట్ నచ్చితే చాలు.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏదైనా సరే, ఓకే చెప్పేస్తాడు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు అయిన ఆది.. రంగస్థలం చిత్రంలో అశోక్ బాబుగా ఇండస్ట్రీని ఫిదా చేశాడు. అంతకు ముందు ‘నిన్ను కోరి’ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన ఆది.. తన బాడీ ఫిట్‌నెస్, విలనిజంతో సరైనోడు సినిమాలో మెప్పించాడు.
ఇదిలా ఉంటే మిస్టర్ పర్ఫెక్ట్ అయిన ఆది పెళ్లి గురించి కోలీవుడ్ మీడియాలో కొత్త ప్రచారం ఊపందుకుంది. మలుపు, మరకతమణి సినిమాల్లో తనతో కలిసి నటించిన హీరోయిన్ నిక్కీ గర్లానీని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆది తండ్రి రవిరాజా పుట్టినరోజు వేడుకల్లో వారి ఫ్యామిలీ ఫొటోలో నిక్కీ ఉండడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుండగా.. పరిస్థితులు నార్మల్ కాగానే పెళ్లి ఉంటుందని సమాచారం. దీనిపై అభిమానులు కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఆది, నిక్కీలు మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.