బిగ్ బ్రేకింగ్ : తెలుగు అకాడమీలో భారీ స్కాం.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాయం

by Sumithra |
బిగ్ బ్రేకింగ్ : తెలుగు అకాడమీలో భారీ స్కాం.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాయం
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు అకాడమీలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అకాడమీకి చెందిన రూ.43 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్ జరిగినట్టు సమాచారం. యూబీఐ బ్యాంకులో తాము డిపాజిట్ చేసిన రూ.43కోట్లు బ్యాంకులో లేవని అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్ డ్రా చేసుకున్నారని యూబీఐ ఉన్నతాధికారులు పోలీసులకు తెలిపారు.

అధికారిక పత్రాలు చూపించిన తర్వాతే డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి చెల్లించామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇలా ఒకరిపైఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం తెలుగు అకాడమీ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉండగా.. తాజా స్కాం పై రెండు ప్రభుత్వాలు ఏవిధంగా స్పందిస్తాయో.. ఎటువంటి చర్యలకు ఆదేశిస్తారో వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story