- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వానికి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మరో డిమాండ్
దిశ, మిర్యాలగూడ: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ సంఘీభావ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయక 54 మంది ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మరణించారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని నిరుద్యోగులకు ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెడతామన్నారు. నిరుద్యోగులెవరు ఆత్మహత్యలకు పాల్పడొద్దని బహుజన రాజ్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. తదనంతరం పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఎస్పీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డా.రాజు, జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- jobs
- miryalaguda