- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సింగరేణికి ‘కోల్’కోలేని నష్టం.. రూ. 50 కోట్లు దాటింది
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సింగరేణి బొగ్గు గనులపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. వారం రోజులుగా కురుస్తున్న వానల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపరితల బొగ్గు గనుల్లో పెద్ద ఎత్తున కోల్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే భూగర్భ గనుల్లో ఉత్పత్తి యథావిధిగా సాగుతున్నప్పటికీ పూర్తిస్థాయి ఉత్పత్తి రావడంలేదని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. ఇక భారీ లాభాలే లక్ష్యంగా యాజమాన్యం చేపట్టిన ఓపెన్ కాస్ట్గనులు దాదాపు మొత్తం బురదమయం కావడంతో యంత్రాలు నడిచే పరిస్థితి లేదు. దీంతో ప్రతి రోజు దాదాపు తొమ్మిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగిందని, సంస్థ సుమారు రూ. 50 కోట్లు నష్ట పోయిందని అధికారులు చెబుతున్నారు.
అన్ని జిల్లాల్లోనూ నష్టమే…
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. ఇందులో మొత్తం 19 ఓపెన్ కాస్ట్ గనులు ఉండగా.. 14 గనుల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో రెండు, మందమర్రిలో రెండు, శ్రీరాంపూర్ లో ఒకటి, కరీంనగర్ జిల్లాలోని మేడిపల్లిలో ఒకటి, రామగుండంలో మూడు, ఖమ్మం జిల్లాలోని మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లిలో ఒక్కొక్కటి, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో ఒక ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోంది.
రోజు తొమ్మిది వేల టన్నుల ఉత్పత్తికి బ్రేక్..?
వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రతిరోజు తొమ్మిది వేల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతున్నది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి ఇప్పటికే లక్షా 26 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.
రూ. కోట్లలో నష్టం…
భారీ వర్షాల మూలంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగి యాజమాన్యం తీవ్రంగా నష్టపోతోంది. ప్రధానంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో నష్ట ప్రభావం ఎక్కువగా ఉంది. బొగ్గు టన్ను ధర నాణ్యతను బట్టి రూ. రెండున్నర వేల నుంచి రూ. నాలుగున్నర వేల దాకా పలుకుతుంది. ఈ లెక్కన సింగరేణి యాజమాన్యం భారీగా నష్టపోయిందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కేవలం వారం రోజుల వ్యవధిలోనే సుమారు రూ. 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సంస్థలోని ఓ సీనియర్ అధికారి చెప్పారు. దీని ప్రభావం కార్మికుల సంక్షేమం పై కూడా ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కరోనాతో నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణి భారీ వర్షాలతో మరింత నష్ట పోయిందని ఆయన వాపోతున్నారు.