దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు రూ.5 కోట్లు

by srinivas |
దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు రూ.5 కోట్లు
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు రూ. 5కోట్లు వెచ్చించాలని బుధవారం పాలక మండలి సమావేశంలో తీర్మానించినట్లు చైర్మన్​ సోమినాయుడు వెల్లడించారు. దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు ఆవిష్కరించారు. ఈనెల 17నుంచి 25వరకు ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారని చైర్మన్‌ సోమినాయుడు చెప్పారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికే దర్శనం ఉంటుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed