- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ, బీపీసీఎల్ సహా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 175 లక్షల కోట్లను సమీకరించే లక్ష్యం కొనసాగించనున్నట్టు ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తెలిపారు. దీనికోసం అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ గతేడాది కంటే తక్కువ ప్రభావాన్ని కలిగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొన్న కె వి సుబ్రమణియన్.. వరుసగా ఎనిమిది నెలలపాటు నెలకు రూ. లక్ష కోట్లతో బలమైన జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయని, వినియోగం పెరుగుదలకు ఇది సానుకూల సంకేతమన్నారు.
ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణకు ప్రాధాన్యత ఉంది. రూ. 1.75 లక్షల కోట్ల నిధుల సమీకరణలో ప్రధానంగా ఎల్ఐసీ ఐపీఓ, భారత్ పెట్రోలియం(బీపీసీఎల్) ప్రైవేటీకరణ ద్వారానే ఎక్కువ మొత్తం పొందగలమని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక బీమా కంపెనీతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వాటా అమ్మకాల ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను లక్ష్యంగా ఉంది. పెట్టుబడుల ప్రణాళికలో ఐడీబీఐ బ్యాంక్, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, నీలాచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్, ఎల్ఐసీ ఐపీఓ నిర్ణయాలను 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.