ప‌ల్లెల్లోకి ‘రాయ‌ల్’గా దూసుకొచ్చింది

by Shyam |   ( Updated:2020-09-25 05:17:18.0  )
ప‌ల్లెల్లోకి ‘రాయ‌ల్’గా దూసుకొచ్చింది
X

దిశ, వెబ్‌డెస్క్: ప‌ట్ట‌ణాల్లొ ప‌రుగులు పెట్టి ప‌ల్లెటూర్లలోకి ‘రాయ‌ల్‌’గా దూసుకొచ్చింది. యువ‌త నుంచి ఆరు ప‌దుల వ‌ృద్దుల వ‌ర‌కు అంద‌రి మ‌న‌సు దోచుకుంటోంది రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌. కొత్త కొత్త సొగ‌సుల‌తో అద్భుతమైన ఫీచ‌ర్స్‌తో రోజుకో స్పోర్ట్స్ బైక్ మార్కెట్‌లో అడుగుపెడుతున్నా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల హ‌వా న‌గ‌రాల్లోనే కాదు.. మారుమూల గ్రామాల్లోనూ కొన‌సాగుతోంది. ఖ‌రీదు ఎక్కువైన‌ మైలైజీ త‌క్కువిచ్చిన‌ ఆ బైక్ కు ఫిదా అవుతున్న‌వారు ఎంద‌రో.

సినిమా ముచ్చ‌ట్లు ప్రేమ క‌హానీలు క్యాంప‌స్ క‌బుర్లు గ్యాడ్జెట్ అప్‌డేట్స్ ఈ వ‌రుస‌లో నిలిచేది..కుర్ర‌కారు చ‌ర్చ‌ల్లో త‌రుచుగా వినిపించేది ‘బైక్‌’ల గురించే. ప‌ద‌హారు ప్రాయం దాట‌గానేర‌య్..ర‌య్ మంటూ బైక్‌పై దూసుకెళ్ల‌ాల‌ని మ‌న‌సు ఉవ్విళ్లూరుతుంది. మార్కెట్‌లో అడుగుపెడుత‌న్న కొత్త కొత్త బైక్‌లపై ఓ లుక్ వేస్తుంటారు. ఆక‌ట్టుకునే లుక్‌తోపాటు స్టైల్‌, పిక‌ప్ వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తుంటారు. ఒక బైక్‌ను మ‌రో బైక్‌తో బేరీజు వేస్తుంటారు. అలా గ‌మ‌నిస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ చూడ్డానికి భారీగా ఉంటుంది. స్పోర్ట్స్ బైక్‌లా స్టైల్‌గా ఉండ‌దు. పిక‌ప్ ఓకే కానీ, మైలేజీ తక్కువే ఇస్తుంది. ఖ‌రీదు కూడా ఎక్కువే. అయినా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌పై యూత్‌లో క్రేజీ..క్రేజీ ఫీలింగ్ త‌గ్గ‌ట్లేదు. నలుగురిలో ప్ర‌త్యేక‌త‌, ఆ బైక్‌ను న‌డిపేట‌ప్ప‌డు వ‌చ్చే అనుభూతి, పొలాల మ‌ధ్య‌, మ‌ట్టిరోడ్ల‌పైన దూసుకుపోయే ప‌నితీరు ఇవే..రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను గ్రామీణ‌వాసులు కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న అంశాలు.

ప‌ల్లెల్లో ‘డుగ్..డుగ్..’

గ్రామాల్ల‌ో ఒక‌ప్ప‌డు సైకిళ్లు త‌ప్ప వాహ‌నాలు క‌నిపించడం అరుదు. లూనా, చాంప్‌, ఎక్సెఎల్ వంటి చిన్న వాహానాల‌తోపాటు, బైక్‌లు ఒక్కోక్కటిగా ప‌ల్లెల్లోకి ప్ర‌వేశించాయి. ఆ త‌ర్వాత కార్లు కూడా జామ్మంటూ పల్లె రోడ్లమీద పరుగులు పెట్టాయి. కొద్ది కాలంగా ల‌గ్జ‌రీ కార్లు, ఖరీదైన బైక్‌లు ప‌ల్లె గుమ్మంలోకి అడుగుపెడుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ప‌ల్లెల్లో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల సందడి క‌నిపిస్తుంది. ప్ర‌తి గ్రామంలోనూ పదుల సంఖ్యలో రాయ‌ల్ బైక్‌లు క‌నిపిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామంలోని ఉన్న‌త కుటుంబీకులు మాత్ర‌మే బుల్లెట్ బైక్‌లు వాడేవారు. కానీ, ఈ త‌రంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌తకు రాయ‌ల్ బైక్‌లు చేరువ అవుతున్నాయి.

Advertisement

Next Story