- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగళూరు ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 15 మ్యాచ్‌లో రాజస్తాన్ పై బెంగళూరు అవలీలగా గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసింది.
ఇక 155 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు చాలెంజర్స్ సమిష్ఠిగా రాణించారు. తొలుత ఆరోన్ ఫించ్ 8 పరుగులకే పెవిలియన్ చేరినా.. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (63) మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చి కోహ్లీ సైతం ఈ రోజు మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించాడు. మ్యాచ్ విజయంలో చివరి దాకా నిలబడ్డాడు. 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 124 పరుగుల వద్ద పడిక్కల్ అవుట్ అయ్యాక.. మిడిలార్డర్‌లో ఏబీ డివిలర్స్(12) చేసి క్రీజులోనే నిలబడ్డాడు. దీంతో 8 వికెట్ల భారీ తేడాతో రాజస్తాన్ పై బెంగళూరు జట్టు విజయం సాధించింది.
కింగ్ కోహ్లీ ఇజ్ బ్యాక్
ఐపీఎల్ 15వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝులిపించాడు. వన్‌డౌనల్ వచ్చిన కోహ్లీ బాల్ టు బాల్ తీస్తునే తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగిస్తూ మొత్తం 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాది జట్టును గెలిపించుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ తడబడింది. ఓపెనర్లు చేతులెత్తయడంతో 154 పరుగులకే సరిపెట్టుకుంది. కెప్టెన్ స్మిత్(5) 27 పరుగుల వద్దనే పెవిలియన్ చేరడంతో.. అతడి వెనకాలే జోస్ బట్లర్(22) 31 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కీలక ఓపెనర్లను కోల్పోయిన రాయల్స్ జట్టుకు అంతలోనే మరో ఎదురు దెబ్బ తగిలింది. హార్డ్ హిట్టర్ సంజూ శాంసన్ 4 పరుగులు మాత్రమే చేసి కూడా 31 స్కోర్ బోర్డు వద్ద పెవిలియన్ బాట పట్టాడు.
ఇక మిడిలార్డర్‌లో వచ్చిన రాబిన్ ఉతప్ప(17) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో 70 పరుగుల వద్దనే రాజస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్ కూడా కేవలం 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇటువంటి సమయంలో మహిపాల్ లోమ్రర్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 47 పరుగులు చేసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కానీ, 114 పరుగుల వద్దనే చాహల్ వేసిన బంతిని షాట్ ఆడబోయి దేవదత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 6 వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌కు రాహుల్ తివాతియా, జోఫ్రా ఆర్చర్ తమ వంతు కృషి చేసి నాటౌట్‌గా నిలిచారు. దీంతో నిర్దిష్ఠ 20 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 154 పరుగుల మాత్రమే చేయగలిగింది.
స్కోరు బోర్డు:
Rajasthan Royals Innings: జోస్ బట్లర్ (wk) (c) దేవదత్ పడిక్కల్ (b) నవదీప్ సైని 22(12) స్టీవ్ స్మిత్ (c)(b) ఉదాన 5(5), సంజూ శాంసన్ (c and b) చాహల్ 4(3), రాబిన్ ఉతప్ప (c) ఉదాన (b) చాహల్ 17(22), మహిపాల్ లోమ్రర్ (c) దేవదత్ పడిక్కల్ (b) చాహల్ 47(39) రియాన్ పరాగ్ (c) ఫించ్ (b) ఉదాన 16(18) రాహుల్ తివాతెయా నాటౌట్ 24(12)జోఫ్రా ఆర్చర్ నాటౌట్ 16(10), ఎక్స్‌ట్రాలు 3, మొత్తం పరుగులు 154/6.
వికెట్ల పతనం: 27-1 (స్టీవ్ స్మిత్, 2.4), 31-2 (జోస్ బట్లర్, 3.1), 31-3 (సంజూ శాంసన్, 4.1), 70-4 (రాబిన్ ఉతప్ప, 10.1), 105-5 (రియాన్ పరాగ్, 15.5), 114-6 (లోమ్రర్, 16.4).
బౌలింగ్: ఇసురు ఉదాన 4-0-41-2, వాషింగ్టన్ సుందర్ 4-0-20-0, నవదీప్ సైని 4-1-37-1, యూజువేంద్ర చాహల్ 4-0-24-3, ఆడమ్ జంపా 3-0-27-0, శివం దూబే 1-0-40-0.
Royal Challengers Bangalore Innings: దేవదత్ పడిక్కల్ (b) జోఫ్రా ఆర్చర్ 63(45), ఆరోన్ ఫించ్ lbw (b) శ్రేయాస్ గోపాల్ 8(7), విరాట్ కోహ్లీ (c) నాటౌట్ 72(53), ఏబీ డివిలియర్స్ నాటౌట్ 12 (10).. ఎక్స్‌ట్రాలు 3, మొత్తం స్కోరు 158/2
వికెట్ల పతనం: 25-1 (ఆరోన్ ఫించ్, 2.3), 124-2 (దేవదత్ పడిక్కల్, 15.5)
బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4-0-18-1, జయదేవ్ ఉనాద్కట్ 3-0-31-0, శ్రేయస్ గోపాల్ 4-0-27-1, టామ్ కుర్రాన్ 3.1-0-40-0, రాహుల్ తివాతెయా 4-0-28-0, రియాన్ పరాగ్ 1-0-13-0.