రౌడీషీటర్‌తో సహాజీవనం.. కూతురి పై అత్యాచారం

by srinivas |
రౌడీషీటర్‌తో సహాజీవనం.. కూతురి పై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళతో సహజీవనం చేస్తున్న రౌడీ షీటర్ నీచానికి ఒడిగట్టాడు. తల్లితో ఉంటూనే ఆమె బిడ్డ పై కన్నేశాడు. అదును చూసి అత్యాచారం చేయబోయి కటకటాలపాలయ్యాడు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

ఇదే ప్రాంతానికి చెందిన చెంచుల బాబు (రౌడీషీటర్).. స్థానికంగా ఉన్న మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ తరుణంలోనే ఇంట్లోనే ఎదుగుతున్న కూతురి పై కన్నేశాడు. దీంతో శుక్రవారం ఆమె పై అత్యాచారం చేయబోయాడు. ఈ సమయంలో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరిగెత్తుకొచ్చారు. చెంచుల బాబుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే, గతంలో కూడా చెంచుల బాబు అత్యాచారం, రౌడీషీటర్‌గా పలు కేసుల్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story