- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మహా’ ఘోరం : తవ్విన కొద్దీ బయటపడుతున్న శవాలు
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా ఈశాన్య ముంబైలోని చెంబూరు ప్రాంతం భరత్ నగర్‌లో ఇవాళ ఉదయం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 22కు చేరుకుంది. అయితే, ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని తెలుస్తోంది. కొండ చరియలు, కూలిన గోడ శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు సహాయక సిబ్బంది అంచనా వేస్తున్నారు. కొండ ప్రాంతలోని భారీ గోడ పక్కన కొందరు ప్రజలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి గోడమీద పడటంతో ఆ శిథిలాలు గుడిసెలపై పడ్డాయి. దీంతో నిద్రలోనే కొందరు సజీవ సమాధి అయినట్లు అధికారులు భావిస్తున్నారు.
రక్షణ చర్యలు కొనసాగుతుండగా మరోవైపు వర్షం విఘాతం కల్గిస్తోంది. మట్టి, శిథిలాల కొందరు కూరుకుపోవడంతో వర్షంలో వారిని వెలికి తీయడం కష్టతరంగా మారినట్లు సమాచారం. మట్టిని తవ్వుతున్న కొద్దీ శవాలు బయటకు వస్తున్నాయని.. ఆ బురదలో బతికున్నవారు, కొనప్రాణాలతో ఉన్నవారిని గుర్తించడం కూడా కష్టంగా మారిందని అధికారులు వెల్లడిస్తున్నారు.
భవనం కూలి.. మరో ముగ్గురు..
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలోని మిఖ్రోలి ప్రాంతంలో భవనం కూలి మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో రెండ్రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది.