- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంతా సిద్ధం.. రేపే పెళ్లి.. రూ. 2.5 లక్షలతో పెళ్లికూతుర్లు జంప్!
దిశ, వెబ్ డెస్క్: కట్నకానుకలతో పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లి కొడుకు జంప్ అయ్యాడు.. పరారయ్యాడు.. పెళ్లి తర్వాత కట్నకానుకలతో పెళ్లి కొడుకు జంప్ అయ్యాడనే వార్తలు వింటుంటాం. కానీ, ఈ వార్త డిఫరెంట్. పెళ్లికి ముందురోజు పెళ్లి కొడుకుల వద్ద నుంచి రూ. 2.5 లక్షలు తీసుకుని పెళ్లికూతుర్లు పరారయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కైమోర్ లో ఓ వ్యక్తి తన ఇద్దరు కుమారుల పెళ్లి కోసం సంబంధాలను చూస్తున్నాడు. ఈ సమయంలో కొంతమంది వ్యక్తులను ఆయన సంప్రదించాడు. తమ వద్ద ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.. వారికి ఎవరూ లేరు.. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పడంతో వారిని తమ కొడుకులకు ఇచ్చి పెళ్లి చేసేందుకు అతను ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో అంతా ఓకే అయ్యింది. అయితే, పెళ్లి కొడుకుల నుంచి పెళ్లి కూతర్లు రూ. 2.5 లక్షలు తీసుకున్నారు. పెళ్లికొడుకు వాళ్లు పెళ్లికార్డులను చుట్టాలకు పంచుకున్నారు. పెళ్లి మరునాడే అన్నరోజు పెళ్లి కూతురు వారు పెళ్లి కొడుకు వాళ్లకు తమ వాళ్లు చనిపోయారని తెలియజేశారు. దీంతో పెళ్లి కొడుకు వారంతా ఆ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లినంక అసలు విషయం తెలిసింది. వారంతా ఒకరోజు ముందుగానే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ఇంటి ఓనర్ చెప్పాడు. మోసపోయామని వారు గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ పెళ్లి కూతుర్లు, నకిలీ తల్లి, నకిలీ మామలను అరెస్ట్ చేశారు.