వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టండంటూ మంత్రి గంగుల ఆగ్రహం

by Sridhar Babu |
వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టండంటూ మంత్రి గంగుల ఆగ్రహం
X

దిశ, కరీంనగర్ సిటీ: భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన పగడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, కమిషనర్ గరిమ అగర్వాల్, మేయర్ సునీల్ రావుతో కలిసి.. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై, అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ల సమన్వయ లోపంతో ప్రధాన రహదారిపై నీళ్లు నిలుస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు తప్పిదం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్&బి అధికారులు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది సమన్వయంతో 14.5 కిలో మీటర్ల మేర రోడ్డు పక్కన ఉన్న ఫూట్ పాత్‌కు రంధ్రాలు వేసి.. డ్రైనేజీలోకి వర్షం నీరు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ – కామారెడ్డి రోడ్డు పనుల జాప్యంతో రాంనగర్ ప్రధాన రహదారిపై నీళ్లు నిలిచి.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, సంబంధిత కాంట్రాక్టర్‎కు నోటీసులు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని సీరియస్‌ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed