సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

by Sumithra |   ( Updated:2021-03-07 23:41:16.0  )
road accident
X

దిశ, సూర్యాపేట జిల్లా: సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ముకుందాపురం వద్ద గల అనాధ వృద్దాశ్రమం ఎదుట అదుపుతప్పి డివేడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతి చెందిన మహిళ, క్షతగాత్రులు మచిలీపట్నంలోని కూచిపూడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని కోదాడ హాస్పిటల్ తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story