టిప్పర్ బోల్తా.. తప్పిన ప్రాణ నష్టం

by Sumithra |
టిప్పర్ బోల్తా.. తప్పిన ప్రాణ నష్టం
X

మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలంలో మల్లన్న సాగర్‌కు మట్టిని తరలించే టిప్పర్ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. డ్రైవింగ్‌పై అనుభవంలేని వారు, మైనర్లు టిప్పర్లు నడపడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ యజమానులు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో కూడా ధర్మారం, మిరుదొడ్డి, లింగంపేటలో టిప్పర్లు బోల్తా పడిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి ప్రమాదంలో ఏదైనా ప్రాణ నష్టం జరిగితే బాధ్యులు ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైవింగ్ విషయంలో కనీస నిబంధనలు విధించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story