ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్ బస్సు బోల్తా

by srinivas |   ( Updated:2021-09-26 22:40:47.0  )
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్ బస్సు బోల్తా
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ సమీపంలో సోమవారం ( ఈరోజు) తెల్లవారు జామున జరిగింది. అయితే డ్రైవర్ తప్పిదం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా.. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రావెల్ బస్సు విజయవాడ నుండి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story