- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

X
దిశ,రేగొండ: రెండు లారీలు ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన రేగొండ మండలంలోని భాగిర్థీపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రేగొండ మండలంలోని గంగిరేణి గూడెంకు చెందిన మాలోతు మోతీలాల్ అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కేంద్రంకు తరుచుగా కిరాణా సామానులను సరఫరా చేస్తూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో లారీని లోడ్ చేసుకొని భూపాలపల్లికి వెళ్ళే మార్గంలో మల విసర్జన చేసేందుకు లారీ ఆపగా, లారీ పక్కనే మోతీలాల్ ఉండగా వేరొక లారీ వచ్చి ఢీకొంది. దీంతో మోతీలాల్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు నల్గొండ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నారు. మృతినికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మోతీలాల్ మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story