బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరి మృతి (వీడియో)

by Sumithra |
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరి మృతి (వీడియో)
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-2లో ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును వేగంగా నడుపుతూ రోడ్డుపై వెళుతున్న ఇద్దరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను అయోధ్యరామ్‌, దేబంద్రకుమార్‌ దాస్‌గా గుర్తించారు. వీరిరువురు ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగులని పోలీసులు నిర్ధారించారు. ఘ‌ట‌న అనంత‌రం నిందితుడు కారుతో పాటు జూబ్లీహిల్స్ వైపు ప‌రార‌య్యాడు.

ఇదే స‌మ‌యంలో విధుల్లో ఉన్న పోలీసులు ప్రమాదానికి కార‌ణ‌మైన కారును గుర్తించారు. నిందితులు రోహిత్​ గౌడ్, సుమన్‌ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా కారును సీజ్‌ చేసి బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ మద్యం తాగి కారును డ్రైవ్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed