‘లాలూ ఆరోగ్యం మెరుగుపడింది’

by Shamantha N |
‘లాలూ ఆరోగ్యం మెరుగుపడింది’
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం కాస్తా మెరుగుపడిందని ఆయన కుమారుడు తేజశ్వి యాదవ్ తెలిపారు. గత గురువారం అస్వస్థతకు గురైన లాలూను కుటుంబీకులు రాంచీలోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. గత కొంత కాలంగా లాలూప్రసాద్ యాదవ్ కిడ్నీ సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడిందని.. చికిత్స కూడా కొనసాగుతుందని రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర్ ప్రసాద్ తెలిపారు. దీనిపై తేజశ్వి యాదవ్ కూడా క్లారిటీ ఇచ్చారు. తన తండ్రికి కొవిడ్ -19 పరీక్షలో నెగెటివ్ వచ్చిందని.. మరికొన్ని పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.

Advertisement

Next Story