ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డుల మధ్య వివాదం

by Shyam |
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డుల మధ్య వివాదం
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ బెర్త్ ఊరిస్తున్నా.. ఆస్ట్రేలియా మాత్రం ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని పర్యటనను వాయిదా వేసింది. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ సౌత్ఆఫ్రికా(సీఎస్ఏ) మండిపడుతున్నది. మరి కొన్ని రోజుల్లో ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభం కానున్న సమయంలో సీఏ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సిరీస్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటని సీఎస్ఏ అంటున్నది.

ఆసీస్ పర్యటన రద్దు చేయడంతో ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుందని సౌత్ఆఫ్రికా బోర్డు చెబుతున్నది. సీఎస్ఏ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ కూడా ఆస్ట్రేలియా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఈ పర్యటన కోసం చాలా ఖర్చు చేశామని అంటున్నారు. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం తమ తప్పేమీ లేదని చెబుతున్నది. దక్షిణాఫ్రికాలో కరోనా రెండో వేవ్ ఉధృతమవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నది. అప్పటికీ సఫారీలే ఆస్ట్రేలియా పర్యటనకు రమ్మని కూడా ఆహ్వానించామని.. వారు కోరి స్టేడియంలలోనే మ్యాచ్‌లు నిర్వహిస్తామని చెప్పినా నిరాకరించారని అంటున్నది. ఆటగాళ్ల భద్రతను నిర్లక్యం చేయలేమని.. మా ప్రతిపాదనకు సౌతా్ ఆఫ్రికా నిరాకరించిన తర్వాతే పర్యటనను వాయిదా వేశామని అంటున్నది. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed