పకడ్భందీగా ధాన్యం కొనుగోలు : క‌లెక్ట‌ర్ అనిత‌

by Shyam |
పకడ్భందీగా ధాన్యం కొనుగోలు : క‌లెక్ట‌ర్ అనిత‌
X

దిశ, న‌ల్ల‌గొండ‌: కోవిడ్ – 19 నేపథ్యంలో ధాన్యం కొనుగోలును పకడ్భందీగా చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రైతులకు రోజువారీ కొనుగోళ్లకుసంబంధించి ముందుగానే టోకెన్లు జారీచేసి, తొక్కిసలాట జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో రెండు మాత్రమే తూకం వేసే యంత్రాలు ఏర్పాటు చేయాలని, ఒక్కొక్కరి వద్ద ఆరుగురు హమాలీలు మాత్రమే ఉండాలన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా నియంత్రణకు సబ్బు, బకెట్ నీరు ఏర్పాటు చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో కావాల్సిన తూకం యంత్రాలు, తేమ కొలిచే సాధనాలు, గన్ని బ్యాగులు వెంటనే అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం పెద్ద ఎత్తున వచ్చే చోట వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని మార్కెటింగ్, పౌరసరఫరాలు, డీఆర్డీఏ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లాక్‌డౌన్ మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags: rice purchase, corona, lockdown, collector anitha, nalgonda

Advertisement

Next Story

Most Viewed