బిగ్ బాస్‌లో పార్టిసిపేషన్‌పై సుశాంత్ గర్ల్ ఫ్రెండ్..

by Shyam |
బిగ్ బాస్‌లో పార్టిసిపేషన్‌పై సుశాంత్ గర్ల్ ఫ్రెండ్..
X

దిశ, సినిమా : సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్స్ అంకితా లోఖండే, రియా చక్రవర్తి బిగ్ బాస్‌లో పాల్గొంటారని సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు దీనిపై రియా స్పందించకపోయినప్పటికీ.. ఈ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చింది అంకిత. ప్రజలు తనను ద్వేషించేందుకు ఉవ్విళ్లూరుతున్నారని అభిప్రాయపడింది. ఈ ఏడాది తాను కూడా బిగ్ బాస్‌లో పాల్గొంటున్నానని మీడియాలో వస్తున్న ఊహాగానాలు తన దృష్టికి కూడా వచ్చాయన్న అంకిత.. ఈ విషయంపై నిజాలు తెలుసుకోవాలని అనుకుంటున్న వారు తాను చెప్పేది స్పష్టంగా వినాలని కోరింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 15లో తాను పార్టిసిపేట్ చేయడం లేదని, తన పార్టిసిపేషన్‌పై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. తాను ఇందులో భాగం కానప్పటికీ ప్రజలు తమ హేట్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడంలో ముందున్నారని అభిప్రాయపడింది.

Advertisement

Next Story