ఆర్జీవీ టార్గెట్ మోదీ.. వరుస సెటైర్లు

by Jakkula Samataha |
ఆర్జీవీ టార్గెట్ మోదీ.. వరుస సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో.. మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కానున్నారు. పశ్చిమబెంగాల్‌పై కాషాయ జెండా ఎగురువేసేందుకు మోదీ, అమిత్ షా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరికి వారి ఆశలు ఫలించలేదు. ప్రాంతీయ పార్టీకే మరోసారి బెంగాల్ ప్రజలు పట్టం కట్టారు. 200పైగా సీట్లతో మమతకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

ఈ క్రమంలో మమతకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నాయి. అయితే వివాదాలతో వార్తల్లో ఉండే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్‌లో వినూత్నంగా స్పందించాడు. ‘దీదీ ఫినిష్ అని నిన్న మోదీ గారు చెప్పారు. ఇప్పుడు మరి ఏం చెబుతారు సర్’ అని ఆర్జీవీ ట్విట్టర్‌లో ప్రశ్నించాడు.

అలాగే ఆర్జీవీ చేసిన మరో ట్విట్ ఆసక్తికరంగా మారింది. ‘DIDI O DIDI సినిమా .. మమతా, మోడీ , అమిత్ షా నటించారు’ అంటూ ఒక పోస్ట్ పెట్టిన ఆర్జీవీ.. ఈ సందర్భంగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి అమ్మాయి బ్యాగ్ లాక్కనేందుకు ప్రయత్నిస్తారు. ఆ అమ్మాయి బ్యాగ్ దూరంగా విసిరేయగా.. ఆ ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ కోసం వెళతారు. అప్పుడు ఆ అమ్మాయి బైక్‌ తీసుకుని వెళుతుంది. ఇందులో మమతను బైక్‌పై పోతున్న అమ్మాయితో పోల్చుతుండగా.. ఈ ఇద్దరి వ్యక్తులను మోదీ, అమిత్ షాతో పోల్చుతున్నారు.

Advertisement

Next Story