- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'జాతీయ రహదారి'పై ఆర్జీవీ వ్యాఖ్యలు.. రిస్క్ తీసుకున్నారని అభినందనలు
దిశ, సినిమా: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ‘జాతీయ రహదారి’ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. నరసింహ నంది డైరెక్షన్‌లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్జీవీ.. ట్రైలర్ హార్ట్ టచింగ్‌గా వుందని, కరోనా పాండమిక్‌లో జరిగిన రెండు ప్రేమ కథలకు ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చాడన్నారు. సినిమాకు తప్పకుండా నేషనల్ అవార్డ్ రావాలని కోరుకున్న ఆయన.. ఇంత రిస్క్‌తో సినిమా తీసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ను అభినందించారు. కాగా ఆర్జీవీ దయవల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పిన నిర్మాత రామసత్యనారాయణ.. ఈ నెల 10వ తేదీన వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 200 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు.
డైరెక్టర్ నరసింహ నంది మాట్లాడుతూ.. ఆర్జీవీ తమ ‘జాతీయ రహదారి’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా సంధ్య స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందించిన చిత్రంలో మధు చిట్టె, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సుక్కు సంగీతం అందించగా.. యస్ మురళీ మొహన్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.