- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మధ్యాహ్న భోజనం అదిరిపోవాలి’
విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థుల చదువులపై సమీక్ష నిర్వహించారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమ్మర్ హాలీడేస్ తర్వాత ఇచ్చే వస్తువులు నాణ్యమైనవిగా ఉండాలని చెప్పారు. స్కూళ్లు తెరిచేటప్పటికీ అవి పంపిణీ చేయడానికి రెడీగా ఉండాలన్నారు. స్కూళ్లలో నాడు-నేడు అనే కార్యక్రమంపై ఫోకస్ పెట్టాలని అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. దీనికి సంబంధించి తొలి విడతలో 15715 స్కూళ్లలో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే సమావేశం సమయానికి అన్నీ పూర్తవ్వాలనీ, ఏవైనా పెండింగ్ ఉంటే మళ్లీ జరుపుకునే మీటింగ్‌లో చెప్పాలని సూచించారు. పనులన్నీ జూన్ లోపే పూర్తి చేసి, స్కూళ్లు తెరవగానే విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పి, స్టూడెంట్స్ ఫుల్ హ్యాపీ అయ్యేలా చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం అదిరిపోవాలనీ, టాయిలెట్లు చూస్తేనే వావ్ అనిపించేలా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన గోరు ముద్ద యాప్ సీఎం జగన్‌కి గుర్తొచ్చింది. ‘‘అది సరిగా పనిచేస్తోందా మూలపడిందా అని సీఎం అడిగారు. “అయ్యో భలేవాళ్లు సార్… అది బాగా పనిచేస్తోంది” అని అధికారులు చెప్పారు. మంచిది… మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏ బిల్లులూ పెండింగ్ పెట్టకండి. పెడితే… విద్యార్థులకు నాణ్యత తగ్గించే ప్రమాదం ఉంది’’ అని సీఎం జగన్ చెప్పారు.
tags : Review conference, education system, cm jagan, Lunch at school, Toilet, Students are happy, before summer