- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సాలు దొర ఇక నీ పాలన సాలు దొర..’’ అంటూ పాటలతో ప్రశ్నించిన రేవంత్
దిశ, డైనమిక్ బ్యూరో : పోరాటాలకు అడ్డాగా ఉన్న గడ్డను తాగుబోతులకు అడ్డాగా మారుస్తుంటే మనం మౌనంగా ఉందామా ఆలోచించండి. మా దుఖమంతా నాలుగుకోట్ల ప్రజల కోసమే. ఏ ఆకాంక్షల కోసం ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణని ఎవడి పాలైంది. గద్దర్ పాడిన పాట ‘‘సాలు దొర ఇక నీ పాలన సాలు దొర..’’ గోరటి వెంకన్న పాడిన ‘‘సన్న బియ్యమంటివి ఉన్న బియ్యం పాయె.. పల్లె కన్నీరు పెడుతుంది పరాయి పాలనలో..’’ ‘‘ఎవడిపాలైందిరో ఈ తెలంగాణ.. ఎవడిపాలైందిరో తెలంగాణ’’ అని ఏపూరి సోమన్న పాడిండు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కారు, ఇళ్లు లేని కేసీఆర్.. అటుకులు తిని ఉద్యమం చేశావంటివి కదా.. నీకు ఇన్ని కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో ప్రజలు ఆలోచించండి. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పండించేది పంట కాదు.. అవినీతి పంట అని అన్నారు.
కేసీఆర్‌కు గోరి కట్టాలి
సైదాబాద్ లో జరిగిన హత్యాచారం నన్ను కలిచివేసింది. కానీ నేరస్థుడు అరెస్ట్ కాకముందే.. పట్టుకున్నామని ట్విట్టర్ల పెట్టి మళ్లీ సరిదిద్దుకుంటున్నా అని చెప్పిండే కానీ.. కుటుంబాన్ని పరామర్శించలే.. నేరగాళ్లను ఇట్టే పట్టుకునేందుకు నగరంలో 7 లక్షల కెమెరాలు ఉన్నాయని డీజీపీ చెప్పారు కదా.. నిందితుడిని 7 రోజులైనా పట్టుకోలేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ తెలంగాణ చైతన్యం చూపెట్టి కేసీఆర్‌కు గోరి కట్టాలి. తెలంగాణ సమాజం కళ్లు తెరిస్తే కేసీఆర్ కాలిపోతడని తెలియజెప్పాలి అని అన్నారు.
పంజాగుట్టలో విగ్రహం పెట్టడం ఖాయం
19 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుంది. పంజాగుట్ట సర్కిల్‌లో 25 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తాం. దళితులు 18 శాతం, గిరిజనులు 12 శాతం, మైనార్టీలు 12 శాతం, మిగతా బీసీలు ఆలోచించండి. తెలంగాణ వచ్చాక మీకు ఏం వచ్చిందో ఓ సారి ఆలోచించండి. కేసీఆర్‌కు మాత్రం 100 తరాలకు సరిపడా ఆస్తి వచ్చింది. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగుల కోసం పరేడ్ గ్రౌండ్‌లో ధర్మ యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.